calender_icon.png 13 February, 2025 | 7:38 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

అంబేద్కర్ యువజన సంఘం ఆధ్వర్యంలో ఘనంగా సన్మానం

13-02-2025 04:54:40 PM

లక్షేట్టిపేట (విజయక్రాంతి): పట్టణంలోని అంబేద్కర్ యువజన సంఘం పట్టణ కమిటీ ఆధ్వర్యంలో నూతనంగా లక్షెట్టిపేట సర్కిల్ ఎలక్ట్రానిక్ మీడియా అధ్యక్షులుగా ఎన్నికయిన చింత అభినయ్ కు పూల బొకే బహుకరించి, శాలువాతో గురువారం ఘనంగా సన్మానించారు. ఈ సందర్బంగా అంబేద్కర్ యువజన సంఘం పట్టణ అధ్యక్షులు తొగరు రాజుతో కలిసి అయన మాట్లాడుతూ.. నిస్వార్థంగా సేవ చేస్తానని అన్నారు. విలేకరుల సమస్యలను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లి పరిష్కరించేలా కృషి చేస్తానన్నారు. సమాజంలోని అన్ని వర్గాల ప్రజల కోసం పని చేస్తానన్నారు.

ఈ కార్యక్రమంలో అంబేద్కర్ యువజన సంఘం రాష్ట్ర నాయకులు దమ్మ నారాయణ, జిల్లా నాయకులు మాలెం చిన్నన్న, సీనియర్ నాయకులు గోల్కొండ సత్తయ్య, చాతరాజు రాజేష్, వేముల ప్రేమ్ సాగర్, జక్కుల రాజలింగు, గుత్తికొండ శ్రీధర్, అలుగునూరి నరేష్, దుంపల భాస్కర్, బొల్లెడ్ల విజయ్ కుమార్, పానగంటి శేఖర్, మాజీ కౌన్సిలర్ సురేష్ నాయక్, చిన్న రమేష్, గడ్డం వినీత్, కుమార్, ప్రెస్ క్లబ్ అధ్యక్షులు అల్లంపల్లి రమేష్, ప్రధాన కార్యదర్శి చీకటి తిరుపతి, ప్రచార కార్యదర్శి భైరం లింగన్న, పెండెం రాజశేఖర్ తదితరులు పాల్గొన్నారు.