calender_icon.png 16 April, 2025 | 5:38 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

అంబేద్కర్ యువజన సంఘం ఆధ్వర్యంలో సహపంక్తి భోజనం

14-04-2025 09:32:16 PM

గజ్వేల్: మున్సిపాలిటీ పరిధిలోని ప్రజ్ఞాపూర్ లో అంబేద్కర్ జయంతి పురస్కరించుకొని సోమవారం అంబేద్కర్ యువజన సంఘం ఆధ్వర్యంలో సహపంక్తి భోజన కార్యక్రమం నిర్వహించారు. కార్యక్రమంలో అంబేద్కర్ సంఘం నాయకులతో పాటు సిఐ సైదా పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. అంబేద్కర్ చూపిన బాటలో ప్రజలంతా నడవాలని సూచించారు. కార్యక్రమంలో  నాయకులు ముత్యాలు కనకయ్య, సాగర్, మహేందర్ ఉప్పలయ్య తదితరులు పాల్గొన్నారు.