calender_icon.png 30 December, 2024 | 12:17 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

సమానత్వం కోసం జాతిని జాగృతం చేసిన మహనీయుడు అంబేద్కర్

06-12-2024 06:30:48 PM

కాంగ్రెస్ రాష్ట్ర నాయకుడు నీలం మధు ముదిరాజ్ 

ఆయన ఆశయాలను అందరం కొనసాగించాలి

పటాన్ చెరు (విజయక్రాంతి): అంటరానితనాన్ని రూపుమాపి అన్ని వర్గాల సమానత్వం కోసం జాతిని జాగృతం చేసిన మహనీయుడు డాక్టర్ బీఆర్ అంబేద్కర్ అని మెదక్ పార్లమెంట్ కాంగ్రెస్ పార్టీ కంటెస్టెడ్ క్యాండిడేట్ నీలం మధు ముదిరాజ్ అన్నారు. శుక్రవారం బాబాసాహెబ్ అంబేద్కర్ వర్ధంతిని పురస్కరించుకొని చిట్కుల్ లోని ఆయన నివాసంలో అంబేద్కర్ చిత్రపటానికి పూలమాల వేసి ఆయన ఘన నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. సమాజంలో అసమానతలు తొలగించి సమానత్వం కోసం రిజర్వేషన్లు అందించిన మహోన్నత వ్యక్తి డాక్టర్ బీఆర్ అంబేద్కర్ అని కొనియాడారు. అన్ని వర్గాల వారికి సమన్యాయం జరగాలనే తలంపుతో రాజ్యాంగాన్ని రూపొందించాడని తెలిపారు. సమాజంలో సామాజిక అసమానతలు రూపుమాపితేనే అభివృద్ధి పథంలో పయనిస్తామని నమ్మి ఆనాడే రాజ్యాంగంలో బడుగు వర్గాలకు ప్రాధాన్యతనిచ్చిన అంబేద్కర్ గారి ఆశయ సాధనకు నేటి సమాజంలో ప్రతి ఒక్కరు కృషి చేయాలని ఆయన పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో స్థానిక నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు.