22-04-2025 12:00:00 AM
ఆదిలాబాద్, ఏప్రిల్ 21 (విజయక్రాంతి): బీజేపీ ప్రభుత్వం హయాంలోనే డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్‌కు సరైన గౌరవం దక్కిందని ఆదిలాబాద్ పార్లమెంట్ సభ్యులు నగేష్ అన్నారు. స్థానిక జిల్లా పార్టీ కార్యాలయంలో సోమవారం ఏర్పాటు చేసిన భార తరత్న డాక్టర్ బీఆర్ అంబేద్కర్ జయంతి ఉత్సవాల్లో భాగంగా జిల్లా సెమినార్‌లోబీజేవైఎం రాష్ట్ర అధ్యక్షులు మహేందర్ తో కలిసి ఎంపీ పాల్గొన్నారు.
ముందుగా అంబేద్కర్ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా ఎంపీ నగేష్ మాట్లాడుతూ కాంగ్రెస్ ప్రభుత్వ హాయంలో డాక్టర్ బీఆర్ అంబేద్కర్‌కు అడుగున అవమానం జరిగిందని గుర్తు చేశారు. కాంగ్రెస్ పార్టీ రాజ్యాంగం పేరుతో, భారతరత్న డాక్ట ర్ బాబాసాహెబ్ అంబేద్కర్ పేరుతో ప్రజలను మభ్యపెడుతుందని ఆరోపించారు.
ఈ సమావేశంలో జిల్లా పార్టీ అధ్యక్షుడు పతంగి బ్రహ్మానంద్, రాష్ట్ర బీజేపీ కౌన్సిలింగ్ సభ్యు లు తాటిపెళ్లి రాజు, రైల్వే బోర్డ్ డైరెక్టర్ రఘుపతి, నాయకులు మాధవ్ అమ్టే, వివిధ మండలాల నుంచి వచ్చిన పార్టీ శ్రేణులు, పదాధికారులు తదితరులు పాల్గొన్నారు.