calender_icon.png 19 April, 2025 | 5:30 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

వెలుగు చూపిన మహానీయుడు అంబేద్కర్

15-04-2025 12:40:26 AM

మాజీ మంత్రి హరీష్ రావు 

పటాన్చెరు, ఏప్రిల్ 14ః చీకట్లో ఉన్న వారికి వెలుగు చూపిన మహానీయుడు డాక్టర్ బీఆర్ అంబేద్కర్ అని మాజీ మంత్రి, సిద్దిపేట ఎమ్మెల్యే తన్నీరు హరీష్ రావు కొనియాడారు. సోమవారం రామచంద్రాపురం మండలం కొల్లూరులో నిర్వహించిన అంబేద్కర్ 135వ జయంతి వేడుకల్లో పాల్గొని, అంబేద్కర్ విగ్రహానికి పూలమాలవేసి నివాళులర్పించారు.

అంబేద్కర్ మహిళలకు, కార్మికులకు, దళిత గిరిజనులకు అన్ని వర్గాల్లో వెలుగు నింపారని అన్నారు. అంబేద్కర్ జయంతి అంటే పూల మాలలు వేయడం కాదు, వారి ఆశయాలను కొనసాగించాలని అన్నారు. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుకు అంబేద్కర్ రాజ్యాంగమే దారి చూపిందని తెలిపారు.

ఈ కార్యక్రమంలో పటాన్ చెరు నియోజకవర్గం బీఆర్‌ఎస్ కో ఆర్డినేటర్ వెన్నవరం ఆదర్శ్ రెడ్డి, మాజీ ఎమ్మెల్యే కే.సత్యనారాయణ, మాజీ సర్పంచ్ మల్లేపల్లి సోమిరెడ్డి, సీనియర్ నాయకులు బాలాజీ, నరసింహ, బుచ్చిరెడ్డి, స్థానిక నాయకులు, కార్యకర్తలుపాల్గొన్నారు.