calender_icon.png 16 April, 2025 | 3:38 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

బడుగు, బలహీన వర్గాల విముక్తి ప్రదాత అంబేద్కర్..

14-04-2025 05:53:46 PM

బెల్లంపల్లి అర్బన్ (విజయక్రాంతి): భారత రాజ్యాంగ నిర్మాత బిఆర్ అంబేద్కర్ 154 జయంతి వేడుకలు రాజకీయాలకతీతంగా స్వచ్ఛందంగా నిర్వహించుకున్నారు. బిఆర్ఎస్ ఆధ్వర్యంలో జరిగిన ఈ వేడుకల్లో మాజీ ఎమ్మెల్యే దుర్గం చిన్నయ్య పాల్గొన్నారు. కంట అంబేద్కర్ చౌరస్తాలో డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ విగ్రహానికి పూలమాలవేసి నివాళి అర్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. బడుగు బలహీన వర్గాలకు అంబేద్కర్ బాసటగా నిలిచారన్నారు. ఆయన స్ఫూర్తితో బడుగు బలహీన వర్గాల ప్రజలు అభివృద్ధిలో ముందుకు వెళ్లాలి అన్నారు.

భారత రాజ్యాంగ నిర్మాత బడుగు బలహీన వర్గాల వికాసానికి పాటుపడిన మహానేత అని కొనియాడారు. తరతరాల పీడన అణిచివేత వివక్ష నుంచి దళిత బడుగు బలహీన వర్గాలను విముక్తి చేయడానికి జీవితాంతం కృషిచేశా అన్నారు. వ్యవస్థలో సమాన హక్కుల కోసం పరితపించిన ఆదర్శమూర్తి భారత జాతికి వెలకట్టలేని సేవలందించి భవిష్యత్తు తరాలకు సైతం స్ఫూర్తిదాయకంగా నిలిచి నా గొప్ప నేత డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ అని అన్నారు. ఈ కార్యక్రమంలో టిఆర్ఎస్ కార్యకర్తలు, నాయకులు పాల్గొన్నారు.