28-03-2025 12:34:15 AM
- నిందితున్ని అదుపులోనికి తీసుకున్న పోలీసులు
కొండపాక, మార్చి 27 : కొండపాక మండలం దమ్మక్క పల్లి గ్రామంలో గురువారం అంబేద్కర్ విగ్రహాన్ని ధ్వంసం చేసిన ఘటన చోటుచేసుకుంది. కుకునూరు పల్లి ఎస్ ఐ శ్రీనివాస్ తెలిపిన వివరాల ప్రకారం కొండపాక మండలం దమ్మక్కపల్లి గ్రామం లో బస్టాండ్ వద్ద ఉన్న అంబేద్కర్ విగ్రహాన్ని ఏర్పాటు చేసి ఆవిష్కరించలేదు.
దమ్మక్క పల్లి గ్రామానికి చెందిన జింక తిరుపతి అనే వ్యక్తి విగ్రహం ఉన్న గద్దె పైన కూర్చుని కట్టెతో అంబేద్కర్ చేతిని కొట్టాడు. కొట్టడంతో అంబేద్కర్ విగ్రహం చేయి విరిగింది. ఇది గమనిస్తున్న గ్రామస్తులు అడ్డు కునే ప్రయత్నం చేయగా వారిని నానా బూ తులు తిడుతూ వారిపై విరుచుకుపడ్డారు. కుక్కునూరు పల్లి పోలీసులకు సమాచారం ఇవ్వడంతో ఎస్ ఐ శ్రీనివాస్ తమ సిబ్బందితో ఘటనా స్థలానికి చేరుకొని తిరుపతిని అదుపులోకి తీసుకున్నామని తెలిపారు.