మనకొండూర్, జనవరి22 : భారత రత్న డాక్టర్ బాబా సాహెబ్ అంబేడ్కర్ దేశ చరిత్రలో చిరస్మరణీయంగా నిలిచిన గొప్ప మేధావి అని నగర మేయర్ యాదగిరి సునీల్ రావు అన్నారు. కరీంనగర్ నగరపాలక సంస్థ అభివృద్ధిలో భాగంగా బుధవారం రోజు నగరానికి ముఖద్వారం అయిన అలుగునూరు చౌరస్తాలో ఏర్పాటు చేసిన అంబేడ్కర్ కాంస్య విగ్రహాన్ని పలువురు కార్పొరేటర్లు, అధికారులతో కలిసి ప్రారంభించారు. కార్పోరేటర్లు బోనాల శ్రీకాంత్, ఎదుల్ల రాజశేఖర్, ఐలేంధర్ యాదవ్, సుధగోని మాధవి కృష్ణ గౌడ్, కోల మాలతి సంపత్ రెడ్డి, స్థానిక నాయకులు మల్లారెడ్డి, కుల సంఘాల నాయకులు పాల్గొన్నారు.