27-03-2025 07:43:02 PM
కార్యక్రమంలో పాల్గొన్న చెన్నూరు ఎమ్మెల్యే వివేక్ వెంకటస్వామి..
నారాయణఖేడ్: నారాయణఖేడ్ నియోజకవర్గంలోని మనూరు మండలం కమలాపూర్ లో అంబేద్కర్ ఆవిష్కరణ కార్యక్రమం గురువారం ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా నారాయణఖేడ్ నుండి కమలాపూర్ వరకు ప్రత్యేక ర్యాలీ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమంలో చెన్నూరు ఎమ్మెల్యే గడ్డం వివేక్ వెంకటస్వామి, నారాయణఖేడ్ ఎమ్మెల్యే పి. సంజీవరెడ్డి, ఖేడ్ మాజీ ఎమ్మెల్యే ఎం.భూపాల్ రెడ్డి, కాంగ్రెస్ పార్టీ నాయకులు చంద్రశేఖర్ రెడ్డి, భోజిరెడ్డి, రాకేష్ షట్కార్, జిఎంఆర్ ఫౌండేషన్ నాయకులు గుర్రపు మచ్చందర్, కమలాపూర్ మారుతి, దళిత సంఘాల నాయకులు, తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ... అంబేద్కర్ ఆశయ సాధనకు ప్రతి ఒక్కరు కృషి చేయాలని ఆయన అడుగుజాడల్లో అందరూ నడుచుకోవాలని సూచించారు.