calender_icon.png 2 March, 2025 | 12:46 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

రిమ్స్ ఆస్పత్రి ఎదుట ఘనంగా అంబేద్కర్ విగ్రహావిష్కరణ

11-12-2024 04:33:22 PM

ఆదిలాబాద్ (విజయక్రాంతి): ఆదిలాబాద్ పట్టణంలోని రిమ్స్ ఆసుపత్రి ప్రధాన గేటు ఎదుట ఏర్పాటు చేసిన రాజ్యాంగ నిర్మాత బాబాసాహెబ్ అంబేద్కర్ విగ్రహ ఆవిష్కరణ ఘనంగా జరిగింది. మాత రమాబాయి అంబేద్కర్ మహిళా మండలి ఆధ్వర్యంలో బుధవారం ఏర్పాటు చేసిన కార్యక్రమంలో మండలి అధ్యక్షురాలు శోభా తుల్జాపూరే ముఖ్యఅతిథిగా పాల్గొని అంబేద్కర్ విగ్రహాన్ని ఆవిష్కరించారు. అనంతరం పంచాశీల జెండాను ఎగరవేసి బుద్ధ వందన గావించారు. ఈ సందర్భంగా అంబేద్కర్ బడుగు, బలహీన వర్గాల కోసం చేసిన సేవలను కొనియాడారు. అంబేద్కర్ నూతన విగ్రహావిష్కరణ సమాజంలోని అన్ని వర్గాల సహకారంతో సాధ్యమైంది. శోభ తుల్జాపూరే అన్నారు. ప్రతి ఒక్కరూ అంబేద్కర్ చూపిన మార్గంలో నడుచుకోవాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో మహిళ మండలి నాయకురాలు బేబీ బాయి కానిందే, సులోచన జాబడే, రమాబాయి కాంబ్లే, ఆశా బాయి తదితరులు పాల్గొన్నారు.