calender_icon.png 16 April, 2025 | 7:23 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

తీవ్ర ఉద్రిక్తతల మధ్య అంబేద్కర్ విగ్రహ ఆవిష్కరణ

14-04-2025 10:56:26 PM

రోడ్డు మధ్యలో అర్ధరాత్రి వెలిసిన అంబేద్కర్ విగ్రహం..

అధికారులకు సవాలుగా మారిన విగ్రహ ఆవిష్కరణ..

అధికారులకు దళిత సంఘాల నాయకుల వాగ్వాదం..

కొల్చారం (విజయక్రాంతి): తీవ్ర ఉద్రిక్తతల మధ్య భారత రాజ్యాంగ నిర్మాత బాబా సాహెబ్ అంబేద్కర్ విగ్రహ ఆవిష్కరణ మండల కేంద్రమైన కొల్చారంలో మధ్య రాత్రి మెదక్ హైదరాబాద్ జాతీయ రహదారి నుండి కొల్చారం గ్రామంలోకి వెళ్లే పంచాయతీరాజ్ రోడ్డు మధ్యలో గద్దెనిర్మానం చేపట్టి అంబేద్కర్ విగ్రహం ఏర్పాటు చేశారు. ఆదివారం ఉదయం రాత్రికి రాత్రి వెలసిన విగ్రహాన్ని చూసి ప్రజలు ఆశ్చర్యపోయారు. దీంతో గ్రామపంచాయతీ కార్యదర్శి అంజయ్యకు సమాచారం ఇవ్వగా పంచాయతీ కార్యదర్శి పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. ఎస్ఐ మహమ్మద్ గౌస్ బస్టాండ్ వద్దకు వచ్చి రోడ్డుపై ఏర్పాటు చేసిన విగ్రహాన్ని చూసి నడిరోడ్డుపై పెట్టడం వలన రోడ్డు ప్రమాదాలు జరుగుతాయని ఖాళీ స్థలాన్ని చూసి విగ్రహాన్ని వేరే చోటుకు మార్చుకోవాలని దళిత సంఘాల నాయకులకు వెల్లడించారు.

అయినప్పటికీ వారు వినకపోవడంతో ఉదయం నుండి సాయంత్రం నాలుగు గంటల వరకు తీవ్ర ఉద్రిక్తత నెలకొంది. పంచాయతీ కార్యదర్శి అంజయ్య, డిప్యూటీ తాసిల్దార్ నాగవర్ధన్, ఎస్సై మహమ్మద్ గౌస్ తో దళిత సంఘాల నాయకులు వాగ్వాదానికి దిగారు. అయినప్పటికీ అధికారులు దళిత సంఘాల నాయకులకు నచ్చ చెప్పినప్పటికీ వారు వినకపోవడంతో పాటు అందరూ ఒకేసారి విగ్రహం దగ్గరికి చేరుకొని జై భీమ్ నినాదాలు చేస్తూ కొబ్బరికాయలు కొట్టి పటాకులు కాలుస్తూ విగ్రహావిష్కరణ చేశారు. కాంగ్రెస్ పార్టీ ఎస్సీ సెల్ జిల్లా కార్యదర్శి మారెల్లి అనిల్ అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. దీంతో అధికారులు చేసేదేమీ లేక వేణు తిరిగి వెళ్లిపోయారు. విగ్రహావిష్కరణ చేసిన అనంతరం డిజె సౌండ్ తో భారీ ర్యాలీ నిర్వహించారు.