19-09-2024 12:30:09 AM
శివ్వంపేట, సెప్టెంబరు 18: మెదక్ జిల్లా శివ్వంపేట మండలం కొంతాన్‌పల్లి గ్రామంలో గుర్తుతెలియని దుండగులు మంగళవారం రాత్రి అంబేద్కర్ విగ్రహాన్ని ధ్వంసం చేశారు. విషయం తెలుసుకున్న వెల్దుర్తికి చెందిన భీమ్ వారియర్స్ యూత్ సభ్యులు, దళిత నాయకు లు బుధవారం ఉదయం గ్రామంలో ఆందోళన చేపట్టారు. విగ్రహాన్ని ధ్వంసం చేసిన దుండగులను కఠినంగా శిక్షించాలని డియాండ్ చేశారు. సీఐ రంగాకృష్ణ, ఎస్‌ఐ శివానంద్ ఘటనకు భాద్యులను కఠినంగా శిక్షిస్తామని హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో భీమ్ వారియర్స్ యూత్ సభ్యులు రవీందర్ అశోక్, అభిల్ ప్రసాద్, దళిత నాయకులు పాల్గొన్నారు.