calender_icon.png 16 April, 2025 | 2:34 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

అంబేద్కర్ చేసిన సేవలు మరువలేనివి

14-04-2025 08:47:10 PM

పెద్దపెల్లి ఎంపీ వంశీ...

లక్షెట్టిపేట (విజయక్రాంతి): భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్.బి. ఆర్ అంబేద్కర్ చేసిన సేవలు మరువలేనివని పెద్దపెల్లి ఎంపీ వంశీకృష్ణ, చెన్నూర్ ఎమ్మెల్యే వివేక్ వెంకటస్వామి అన్నారు. సోమవారం స్థానిక ఉత్కూర్ చౌరస్తా వద్ద అంబేద్కర్ విగ్రహానికి పూలమాలవేసి 134 వ జయంతి వేడుకలలో నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.... దేశానికి రాజ్యాంగాన్ని అందించడమే కాకుండా భారతదేశ పౌరులకు తమ హక్కులు లభించేలా చర్యలు తీసుకున్నాడని కోనియాడారు.

సువిశాల భారతదేశానికి రాజ్యాంగాన్ని అందించిన ఘనత అంబేద్కర్ కి దక్కుతుందన్నారు. భారత దేశ పౌరులు నేడు అనుభవిస్తున్న అన్ని హక్కులు అంబేద్కర్ ప్రసాదించినవేనన్నారు. బడుగు బలహీన వర్గాలకు ఆయన అందించిన రిజర్వేషన్ల కారణంగా ఎంతో మంది ఉన్నత ఉద్యోగాలు ఉన్నత పదవులు అలంకరించారని గుర్తు చేశారు. తను అనుభవిస్తున్న పదవి సైతం ఆయన భిక్ష అని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో స్థానిక నాయకులు శాంతి కుమార్, రాజు, శ్రీనివాస్, తదితరులు పాల్గొన్నారు.