calender_icon.png 16 April, 2025 | 4:27 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

రావి ఆకుపై అంబేద్కర్ చిత్రం

14-04-2025 10:03:17 PM

మహబూబాబాద్ (విజయక్రాంతి): బాబాసాహెబ్ అంబేద్కర్ జయంతిని పురస్కరించుకొని మహబూబాబాద్ జిల్లా ఇనుగుర్తి మండల కేంద్రంలోని సాంఘిక సంక్షేమ బాలికల గురుకుల పాఠశాలలో 9వ తరగతి చదువుతున్న కే. అమూల్య తన సూక్ష్మ కళ ద్వారా రావి ఆకుపై అంబేద్కర్ చిత్రాన్ని గీసి అబ్బురపరిచింది. అలాగే జిల్లా వ్యాప్తంగా విద్యార్థులకు అంబేద్కర్ - అందరివాడు అనే అంశంపై నిర్వహించిన వ్యాసరచన పోటీలో అమూల్య ప్రథమ స్థానంలో నిలిచింది. అమూల్య ప్రతిభను చూసి ప్రజా ప్రతినిధులు అధికారులు ప్రశంసలతో ముంచెత్తారు. ప్రభుత్వ విప్, డోర్నకల్ ఎమ్మెల్యే డాక్టర్ జాటోత్ రామచంద్రు నాయక్ , మహబూబాబాద్ ఎమ్మెల్యే డాక్టర్ భూక్యా మురళి నాయక్ చేతుల మీదుగా బహుమతి, ప్రశంసా పత్రం అందుకున్నారు.