calender_icon.png 9 February, 2025 | 2:36 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

అంబేద్కర్ తాత్వికత మూలం నుంచే బహుజన సాహిత్యం

08-02-2025 11:47:15 PM

మీడియా అకాడమీ మాజీ చైర్మన్ అల్లం నారాయణ...

సిద్దిపేట (విజయక్రాంతి): దేశంలో మతం అర్జికాదిపత్యాన్ని, రాజకీయాదిపత్యాన్ని నడిపిస్తుందని మీడియా అకడామీ మాజీ చైర్మన్ అల్లం నారాయణ అన్నారు. దళిత, బహుజన సాహిత్యానికి మూలం అంబేద్కర్ తాత్వికత అయితే అంబేద్కర్ తాత్వికత మూలం నుంచి వచ్చిందే బహుజన సాహిత్యామని చెప్పారు. ప్రజాస్వామిక రచయితల వేదిక 16వ వార్షికం పురష్కరించుకుని శనివారం సిద్దిపేటలో తెలుగు సాహిత్యం అంబేద్కర్ ప్రభావం అనే అంశంపై సదస్సు నిర్వహించారు. ఈ సందర్భంగా అల్లం నారాయణ మాట్లాడుతూ... దేశంలో అమలవుతున్న హిందూ మతోన్మాద, ఫాసిస్టు, అభిజాతీయ పోకడల సందర్భంలో డాక్టర్ బీఆర్ అంబేద్కర్ ప్రభావం ఉంచుకోవడం అభినందనీయమన్నారు. అంబేద్కర్, దళిత సాహిత్యం, అనేక వ్యవస్తలు నిర్వీర్యం కావాడానికి ప్రదాని మోడి, మంత్రి షాల రాజ్యం కారణమని చెప్పారు.

ప్రస్తూతం దేశంలో ఏవరు ఏలా ఉండాలి, ఏలా మాట్లాడాలనేది వారు నిర్ణయిస్తున్నారని విమర్శించారు. అంబేద్కర్‌ను జాగ్రత్తగా గమనించి ఉంటే కమ్యూనిస్టులకు, అంబేద్కర్ వాదులకు మధ్య క్లాశ్ ఉండేదికాదన్నారు. మనం ఏమి అలోచిస్తున్నాం, సమాజం ఏటుపోతుందనేది గమనించాల్సిన అవసరం ఉందన్నారు. ఇలాంటి పరిస్థితిలో తెలుగు సాహిత్యంపై అంబేద్కర్ ప్రభావం అంశం ఎంచుకుని అందరికి ఆదర్శంగా నిలిచారని చెప్పారు. అమెరికన్ అంబేద్కర్ వాదులు అంబేద్కర్‌ను అనుషీలన, పరిశీలన చేస్తున్నామని చెప్పారని, అందుకే అంబేద్కర్ పునరుజ్జీవ మానవుడని కొనియాడారు. దళితులు, శూద్రులు, పంచములు సంపద సృష్టిలో ఉన్నారు కానీ సంపదకు ఓనర్లుగా లేరని చెప్పారు. ఇదంతా ఛాతుర్వర్ణ, కుల వ్యవస్థ ప్రభావమేనన్నారు. కారంచెడు తరువాత దళిత సాహిత్యంలో అనేక మార్పులు వచ్చాయని పేర్కొన్నారు.

విప్లవవాదం కొంచెం వెనుకంజ వేసిన కాలంలో వచ్చిన మార్పు అస్తిత్వ ఉద్యమాలు, దళిత, బహుజన వాదంతో కూడిన సాహిత్యమని చెప్పారు. ఇవ్వాల జరుగుతున్న సాహిత్యం, నడుస్తున్న చరిత్ర అంతా బహుజన తాత్విక సిద్దాంతం పునాదుల మీద నడుస్తుందన్నారు. ఈ కార్యక్రమంలో నందిని సిదారెడ్డి, ప్రజాస్వామిక రచయిత్రుల వేదిక ప్రతినిధులు అనిశెట్టి రజిత, కాత్యాయని విద్మహే, రామలక్ష్మి, శాంతి ప్రభోధ, షనాహజ్ బేగం, కవులు సిద్దంకి యాదగిరి, రంగచారి, సువర్ణదేవి, బీమసేనా, డిబీఎఫ్, ప్రజాసంఘాల నాయకులు శంకర్, శ్రీహరి యాదవ్, శ్రీకాంత్, ప్రసాద్ తదితరులు పాల్గొన్నారు.