16-04-2025 01:51:47 AM
కోదాడ ఏప్రిల్ 15: కోదాడ పట్టణానికి చెందిన ప్రముఖ సామాజిక కార్యకర్త గుండెపంగు రమేష్ కు మరో జాతీయ అవార్డు లభించింది. డాక్టర్ బి ఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా కొత్తపేట లో అంబేద్కర్ 134 వ జయంతి ఉత్సవాలను పురస్కరించుకొని అంతర్జాతీయ గుర్తింపు పొందిన స్వర్ణ సోషల్ సర్వీస్ ఆర్గనైజషన్ ఆధ్వర్యంలో నిర్వహించిన కార్యక్రమంలో ఉత్తమ సామాజిక సేవకునిగా గుండెపంగు రమేష్ చేస్తున్న సేవలను గుర్తించి డాక్టర్ బి ఆర్ అంబేద్కర్ జాతీయ సేవా రత్న పురస్కారానికి ఎంపిక చేసి అవార్డును అందించారు .
రమేష్ మాట్లాడుతూ గత కొన్ని సంవత్సరాలనుండి తాను స్వచ్చందంగా చేస్తున్న సామాజిక కార్యక్రమాలకు గుర్తింపుగా ఈ జాతీయ స్థాయి పురస్కారం అందజేసినట్లు ఆయన పేర్కొన్నారు. అంబేద్కర్ పేరిట అవార్డు తీసుకోవడం పట్ల ఆనందం వ్యక్తం చేశారు.ఈ అవార్డు నాలో మరింత సామజిక బాధ్యతను పెంచిందని తెలిపారు..