calender_icon.png 22 April, 2025 | 5:51 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ప్రతి బూత్ లో అంబేద్కర్ జయంతి నిర్వహించుకోవాలి

13-04-2025 08:45:08 PM

బిజెపి పట్టణ అధ్యక్షుడు తూర్పాటి రాజు

హుజురాబాద్,(విజయక్రాంతి): ప్రతి బూత్ లో భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ జయంతోత్సవాలు ఘనంగా నిర్వహించుకోవాలని బిజెపి పట్టణ అధ్యక్షుడు తిరుపతి రాజు పిలుపునిచ్చారు. కరీంనగర్ జిల్లా హుజురాబాద్ మున్సిపాలిటీ పరిధిలోని దమ్మపేట గ్రామంలో ఆదివారం రోజు అంబేద్కర్ విగ్రహానికి శుద్ధి కార్యక్రమం నిర్వహించారు.  సందర్భంగా  రాజు మాట్లాడుతూ.. రాజ్యాంగ నిర్మాత అంబేద్కర్ విగ్రహానికి పాలతో శుద్ధి చేసి చుట్టుపక్కల చెత్తాచెదారాన్ని తొలగించి నట్లు తెలిపారు. 14వ తేదీన జయంతి ఉత్సవాలను ఘనంగా నిర్వహించుకోవాలని అన్నారు. పేద బడుగు బ్లాక్ జ్యోతి అంబేద్కర్ అని కొనియాడారు. ఈ కార్యక్రమంలో కోఆర్డినేటర్  ఆవుల సదయ్య,మొలుగురి రాజు, కొలిపాక వెంకటేష్, పోతుల సంజీవ్, అపరాధ రమణ, మోలుగురి నగేష్, క్యాస వెంకటేష్,కొడిమ్యాల పవన్, భాస్కర్ యాదవ్, తో పాటు తదితరులు పాల్గొన్నారు.