calender_icon.png 16 April, 2025 | 3:33 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ఉల్వనూరులో అంబేద్కర్ జయంతి

14-04-2025 08:09:23 PM

పాల్వంచ (విజయక్రాంతి): పాల్వంచ మండలం ఉల్వనూరు గ్రామంలో భారతరత్న డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ రాజ్యాంగ నిర్మాత 134వ జయంతి ఉత్సవాలను కుల మతాలకతీతంగా నిర్వహించారు. గ్రామంలో ఉన్న రాజకీయ నాయకులు, పెద్దలు ,యువకులు, మహిళలు, పిల్లలు పాల్గొన్నారు. ఈ సందర్భంగా రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బాబాసాహెబ్ యొక్క చేసినటువంటి త్యాగాలను గుర్తు చేసుకొన్నారు. ఎన్ని ప్రతికూల పరిస్థితులైన డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ వలె ప్రతి మనిషి కష్టించి, శ్రమించి ఉన్నత స్థితులకు చేరుకోవాలని దేశ ప్రజల కోసం బాబా సాహెబ్ అంబేద్కర్ చేసిన త్యాగాలను మరవకూడదని తెలియజేశారు. ఈ కార్యక్రమంలో అంబేద్కర్ యువజన కమిటీ ఉల్వనూరు అధ్యక్షులు చాగల బాబు, మోటా నాగేష్, తడికల ప్రభుదాస్, బర్రె లక్ష్మణరావు, బేతన్ రవి ,మోటా జగదీష్ ,నెట్ అమృత రావు, ప్రసాద్, దారం రమేష్, దారం చింటూ తదితరులు పాల్గొన్నారు.