calender_icon.png 16 April, 2025 | 3:42 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

టీఎస్ యుటిఎఫ్ ఆధ్వర్యంలో అంబేద్కర్ జయంతి ఉత్సవాలు

14-04-2025 07:57:45 PM

భద్రాచలం (విజయక్రాంతి): భద్రాచలం పట్టణంలో గల అంబేద్కర్ విగ్రహానికి టీఎస్ యుటిఎఫ్ జిల్లా కమిటీ ఆధ్వర్యంలో అంబేద్కర్ విగ్రహానికి నివాళులర్పించడం జరిగింది. ఈ సందర్భంగా జిల్లా కార్యదర్శి ఎస్ విజయ్ కుమార్ మాట్లాడుతూ... రాజ్యాంగ నిర్మాత, న్యాయ కోవిదుడు, రచయిత, సంఘసంస్కర్త అంబేద్కర్ యొక్క ఆశయాలను నెరవేర్చడంలో ప్రతి సంఘ కార్యకర్త కృషి చేయాలని, అట్టడుగు వర్గాలకు నాణ్యమైన విద్యను అందించడం లో ప్రతి ఉపాధ్యాయుడు కృషి చేయాలని తెలియజేయడం జరిగింది.

రాజ్యాంగ మౌలిక స్ఫూర్తిని విడనాడకూడదని, కులరహిత సమాజం సాధించడమే అంబేద్కర్ కు మనమిచ్చే ఘన నివాళి అని పేర్కొనడం జరిగింది. ఈ కార్యక్రమంలో యుటిఎఫ్ సీనియర్ నాయకులు పి లక్ష్మీనారాయణ, ఏ వెంకటేశ్వర్లు, జిల్లా కార్యదర్శి ఎస్ విజయ్ కుమార్, భద్రాచలం అధ్యక్షులు కొమరం శ్రీనివాస్, దుమ్ముగూడెం సీనియర్ నాయకులు అనసూయ, విజయబాబు, రాంబాబు, రమేష్ మరియు భద్రాచలం మండల కార్యదర్శులు కేఎం కరుణ్ కుమార్, ప్రసాద్ ,సైదులు సీనియర్ నాయకులు జి వెంకటేశ్వర్లు తదితరులు పాల్గొనడం జరిగింది.