14-04-2025 08:37:59 PM
మందమర్రి (విజయక్రాంతి): బాబా సాహెబ్ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ జయంతి వేడుకలు సింగరేణి యాజమాన్యం ఆద్వర్యంలో ఘనంగా నిర్వహించారు. సోమవారం పట్టణంలోని సింగరేణి గ్రీన్ పార్క్ అవరణ లోని అంబేద్కర్ విగ్రహానికి ఏరియా ఇన్చార్జి జిఎం విజయ ప్రసాద్ పూలమాలలు వేసి నివాళులు అర్పించి, జెండా ఆవిష్కరించారు. ఆనంతరం గ్రీన్ పార్క్ నుండి సిఈఆర్ క్లబ్ వరకు బైక్ ర్యాలీ నిర్వహించారు. సి ఆర్ క్లబ్ లో ఏర్పాటు చేసిన అంబేద్కర్ జయంతి వేడుకలకు ఆయన ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు. అంబేద్కర్ మన దేశానికే కాక ప్రపంచమంతటికీ ఆదర్శప్రాయుడని కొనియాడారు. ప్రపంచంలోనే అతిపెద్ద ప్రజాస్వామిక దేశమైన భారతదేశానికి రాజ్యాంగాన్ని రచించిన గొప్ప వ్యక్తి అని అన్నారు.
బిఆర్ అంబేద్కర్ గొప్ప సంఘ సంస్కర్త, తన జీవితం పీడిత జనోద్ధరణకు జరిపిన విరోచిత చరిత్ర తాను నమ్మిన దానిని లక్ష్య శుద్ధి తో ఆచరించి సాహోసో పేతుడైన సత్యవాది అని అన్నారు. తాను తీసుకున్న నిర్ణయాలపై తాను నిలబడగల ధైర్యవంతుడని, భారతదేశంలో ఉన్న పేదవారికి బడుగు బలహీన వర్గాలకు ఆయన దేవుడు అని ఆయన సేవలను కొనియాడారు. ఈ సందర్భంగా సింగరేణి హై స్కూల్ విద్యార్థులకు రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బిఆర్ అంబేద్కర్ జీవిత చరిత్ర పై వ్యాస రచన పోటీలు నిర్వహించారు. ఈ పోటీలలో గెలుపొందిన విద్యార్థిని విద్యార్థులకు బహుమతి ప్రధానం చేశారు.
ఈ కార్యక్రమంలో ఏరియా పర్సనల్ మేనేజర్ ఎస్ శ్యాంసుందర్, సలేంద్ర సత్యనారాయణ బ్రాంచ్ సెక్రటరీ ఏఐటీయూసీ, ఎస్ రమేష్ సిఎంఓఏఐ ప్రెసిడెంట్, వై వెంకటరమణ ఏజీఎం ఈ అండ్ ఎం ఏరియా ఇంజనీర్, కే మైత్రేయ బంధు డివైపిఎం, ఎస్సీ ఎంప్లాయిస్ లైసెన్ ఆఫీసర్, జి బాబు, ఎస్టి ఎంప్లాయిస్ లైసెన్ ఆఫీసర్, ఎండి ముస్తఫా, బీసీ ఎంప్లాయిస్ లైసెన్ ఆఫీసర్, దాసరి సుదర్శన్ వైస్ ప్రెసిడెంట్ , సింగరేణి ఎస్సీ మరియు ఎస్టీ ఉద్యోగస్తుల వెల్ఫేర్ అసోసియేషన్, దామెర ప్రవీణ్ డివై జనరల్ సెక్రెటరీ సింగరేణి ఎస్సీ ఎస్టీ వెల్ఫేర్ అసోసియేషన్, టీ తారాచంద్ ప్రెసిడెంట్ సింగరేణి ఎస్టి ఎంప్లాయిస్ వెల్ఫేర్ అసోసియేషన్, ఏ రవి సెక్రెటరీ సింగరేణి ఎస్టీ ఎంప్లాయిస్ వెల్ఫేర్ అసోసియేషన్, ఏ రవికుమార్, సెక్రటరీ సింగరేణి ఎస్పీ ఎంప్లాయిస్ వెల్ఫేర్ అసోసియేషన్, కే తిరుపతి సెంట్రల్ వైస్ ప్రెసిడెంట్ ఎస్సీ అండ్ ఎస్టీ, అధికారులు,ఉద్యోగులు విద్యార్థులు పాల్గొన్నారు.