14-04-2025 05:26:17 PM
మందమర్రి (విజయక్రాంతి): ప్రపంచ మేధావి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ 134 వ జయంతి వేడుకలను ఆర్పిఐ(ఎ) పార్టీ ఆద్వర్యంలో ఘనంగా నిర్వహించారు. పట్టణంలోని మార్కెట్ ఏరియాలో సోమ వారం ఆర్పిఐ(ఎ) జిల్లా అధ్యక్షులు గుడికందుల తిరుపతి, ముస్లిం మైనార్టీ జిల్లా అధ్యక్షులు ఎం. డి. రహమత్ ఖాన్ లు అంబేద్కర్ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. అనంతరం కేక్ కట్ చేసి మిఠాయిలు పంపిణీ చేశారు. అనంతరం వారు మాట్లాడారు.
దేశ ప్రజలకు రాజ్యాంగబద్ధంగా రావలసిన హక్కులు, భావితరాలకు, బంగారు బాటలు వేసి, ప్రజలకు మార్గదర్శకాలు రచించిన, మహనీయులు అంబేద్కర్ అని ఆయన సేవలను వారు కొనియాడారు, నిరుపేద కుటుంబంలో జన్మించి ఉన్నత చదువులు చదివి అంటరాని తనాన్ని రూపుమాపడమే కాకుండా కుల నిర్మూలన నా అంతమయ్యేలా పోరాటం చేశారని వారు గుర్తు చేశారు. ఆయనను స్ఫూర్తిగా తీసుకొని ప్రజలంతా ఏకతాటిపై నిలబడి రాజ్యాంగాన్ని కాపాడు కోవా లని వారు సూచించారు. ఈ కార్యక్రమంలో ఆర్పిఐ(ఎ)జిల్లా ఇన్చార్జ్ పులిపాక శ్రీనివాస్, జిల్లా ఉపాధ్యక్షులు ధర్మపురి శ్రీనివాస్, ఎండి యాకుబ్, జిల్లా కార్యదర్శి భారతపు తిరుపతి, సీనియర్ నాయ కులు, కర్రావుల బానేష్, శంకర్ లు పాల్గొన్నారు.