14-04-2025 06:51:32 PM
భద్రాద్రి కొత్తగూడెం (విజయక్రాంతి): భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ జయంతి ని పురస్కరించుకొని సోమవారం ఎన్పీడీసీఎల్ ఆధ్వర్యంలో పలు కార్యక్రమాలను నిర్వహించారు. పాల్వంచ సబ్ డివిజన్ కార్యాలయంలో ఏర్పాటు చేసిన జయంతి ఉత్సవాల్లో కొత్తగూడెం సూపరిండెంట్ ఇంజనీర్ మహేందర్ ముఖ్యఅతిథిగా పాల్గొని పాల్వంచ సబ్ డివిజన్ ఆఫీసులో ఏర్పాటుచేసిన సభ కార్యక్రమంలో అంబేద్కర్ చిత్రపటానికి పూలమాలవేసి నివాళులర్పించారు. సబ్ డివిజన్ ఆఫీసు ఆవరణలో ఏర్పాటు చేసిన చలివేంద్రాన్ని ఆయన ప్రారంభించారు. కొత్తగూడెంలోని ట్రైబల్ వెల్ఫేర్ హాస్టల్ లోని విద్యార్థులకు ఎగ్జామ్ ప్యాడ్స్ ,పెన్నులు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమానికి డివిజన్ ఇంజనీర్, ఏడీలు రాంప్రసాద్, మధు బాబు, ఉమారావు, సర్కిల్ ఏఈలు, జే వోలు విద్యుత్ సిబ్బంది పాల్గొన్నారు.