14-04-2025 06:37:10 PM
మందమర్రి (విజయక్రాంతి): భారత రాజ్యాంగ నిర్మాత భారత రత్న డాక్టర్ బిఆర్ అంబేద్కర్ జయంతి వేడుకలు కాంగ్రెస్ పార్టీ ఆద్వర్యంలో ఘనంగా నిర్వహించారు. మండలంలోని ఆదిల్ పేట గ్రామంలోని అంబేద్కర్ విగ్రహానికి సోమవారం నాయకులు పూలమాలలు వేసీ నివాళులు అర్పించారు. అనంతరం నాయకులు మాట్లాఢారు. అంబేద్కర్ రచించిన రాజ్యాంగం తోనే బడుగు బలహీన వర్గాలకు రిజర్వేషన్ లు అందుతున్నా యన్నారు. ఈ కార్యక్రమం లో బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షులు గందె రాంచందర్, యువజన కాంగ్రెస్ నాయకులు ఆకుల అంజి, మాజీ సర్పంచ్ గోదారి రాజేష్, సీనియర్ నాయకులు పెంచాల రాజలింగు, సోదరి పున్నం, మరాఠి శంకర్, చిరంజీవి, వివిధ గ్రామాల కాంగ్రెస్ నాయకులు పాల్గొన్నారు