calender_icon.png 19 April, 2025 | 6:48 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

బిఆర్ఎస్ ఆధ్వర్యంలో అంబేద్కర్ జయంతి వేడుకలు

14-04-2025 04:58:48 PM

రామకృష్ణాపూర్, (విజయక్రాంతి) : రాజ్యాంగ నిర్మాత, భారతరత్న బాబాసాహెబ్ డాక్టర్ బీఆర్ అంబేద్కర్ 134వ జయంతిని సోమవారం పట్టణ బిఆర్ఎస్ పార్టీ కార్యాలయంలో పార్టీ శ్రేణులు ఘనంగా జరుపుకున్నారు. చెన్నూర్ నియోజకవర్గ బిఆర్ఎస్ పార్టీ ఇంచార్జ్ డాక్టర్ రాజారమేష్ అంబేద్కర్ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు.

రాజ్యాంగ పరిరక్షణకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలని పిలుపునిచ్చారు. అనంతరం ఈ నెల 27న వరంగల్ ఎక్కతుర్తిలో జరుగనున్న బీఆర్ఎస్ పార్టీ ర‌జ‌తోత్స‌వ మహాసభను నాయకులు,కార్యకర్తలు,అభిమానులు పెద్దఎత్తున హాజరై సభను విజయవంతం చేయాలని కోరారు.ఈ కార్యక్రమంలో పార్టీ పట్టణ అధ్యక్షుడు సుదర్శన్ గౌడ్,ఆసలా రాజన్న,అనిల్ రావు,రెవెళ్లి ఓదేలు,కంది క్రాంతి,ఆశావేని సత్యనారాయణ,ఆర్నె సతీష్,చంద్ర కిరణ్, లక్ష్మీ కాంత్,మణి, గాజుల బాలక్రిష్ణ తదితరులు పాల్గొన్నారు.