12-04-2025 10:46:06 PM
ఇల్లెందు (విజయక్రాంతి): సింగరేణి ఇల్లందు ఏరియా జియం కార్యాలయంలో శనివారం జరిగిన అంబేద్కర్ జయంతి వేడుకల నిర్వహణ కమిటీ సమావేశంలో సింగరేణి ఇల్లందు ఏరియాలో డా.బి.ఆర్. అంబేద్కర్ జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించాలని ఏరియా జిఎం వీసం కృష్ణయ్య తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. సింగరేణి ఇల్లందు ఏరియాలో ఏప్రిల్-14న డా.బి.ఆర్.అంబేద్కర్ 134వ జయంతి సందర్భంగా జెకె కాలనీ బస్ స్టాప్ ఎదురుగా ఉన్న డా.బి.ఆర్.అంబేద్కర్ విగ్రహం వద్ద ఉదయం 09.30ని.ల నుండి జయంతి వేడుకలు నిర్వహిస్తున్నామని, అలాగే సాంస్కృతిక కార్యక్రమాలు, ఉద్యోగులకు, విద్యార్ధిని విద్యార్థులకు వ్యాసరచన పోటీలు కూడా నిర్వహిస్తున్నామన్నారు.
కావున ఉద్యోగులందరూ పాల్గొనాలని అంబేద్కర్ జయంతి వేడుకల నిర్వహణ కమిటీ సమావేశంలో నిర్ణయిoచడం జరిగిందన్నారు. ఈ కార్యక్రమంలో ఏరియా ఇంజనీర్ ఆర్.వి నరసింహారాజు, డిజిఎం పర్సనల్ జీవి. మోహనరావు, డీ జీఎం వర్క్ షాప్ నాగరాజు నాయక్, డి వై ఎస్.ఇ(సివిల్) వెంకటేశం, ఎస్సీ లైజనింగ్ అధికారి కే.శ్రీనివాసరావు, ఎస్టి లైజనింగ్ అధికారి ఉండం బ్రహ్మం, ఎస్సీ-ఎస్టీ అసోసియేషన్ కమిటి సభ్యులు వి కిషన్, బి.రామారావు, బి.శ్రీనివాస్, ఎల్. ఈర్య, ప్రభాకర్, వెంకటేశ్వర్లు, శంకర్ రావు, తదితరులు పాల్గొన్నారు.