12-04-2025 05:47:03 PM
మందమర్రి (విజయక్రాంతి): సింగరేణి యజమాన్యం ఆద్వర్యంలో ఈ నెల 14న ఏరియాలో అంబేద్కర్ 134వ జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించాలని సింగరేణి ఏరియా ఎస్ఓటు జిఎం విజయప్రసాద్, పర్సనల్ మేనేజర్ శ్యామ్ సుందర్ లు కోరారు. ఏరియాలోని విజయం కార్యాలయంలో అంబేద్కర్ జయంతి ఏర్పాట్లపై సింగరేణి ఏరియా అధికారులతో శనివారం సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ... అంబేద్కర్ జయంతి సందర్భంగా పట్టణంలోని సింగరేణి అంబేద్కర్ గ్రీన్ పార్కు వద్ద ఉన్న అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి కార్యక్రమాన్ని ప్రారంభించాలని, అదేవిధంగా అంబేద్కర్ జయంతి వేడుకలను సీఈఆర్ క్లబ్ లో ఘనంగా నిర్వహించాలని సంబంధిత అధికారులకు సంఘం సభ్యులకు సూచించారు.
ఈ కార్యక్రమంలో ప్రతి ఒక్కరు పాల్గొని విజయవంతం చేయాలని వారు కోరారు. ఈ కార్యక్రమంలో ఎస్సీ లైసెన్ ఆఫీసర్ మైత్రేయ బందు, ఎస్టి లైసెన్ ఆఫీసర్ బాబు, డివైపిఎం ఎండి ఆసిఫ్, ఆఫీస్ సూపరింటెండెంట్ రాయలింగు, సింగరేణి ఎస్సీ, ఎస్టి ఉద్యోగస్తుల వెల్ఫేర్ అసోసియేషన్ ఉపాధ్యక్షులు సుదర్శన్, హరి రామకృష్ణ, కే.తిరుపతి (ఎస్సీ) డిప్యూటీ జనరల్ సెక్రెటరీలు హరి రామకృష్ణ, కే తిరుపతి, ఎస్టి జనరల్ సెక్రెటరీ రవి కుమార్, ఎస్టి సెంట్రల్ కమిటీ ఆర్గనైజింగ్ సెక్రటరీ శివ, ఎస్టి వైస్ ప్రెసిడెంట్ తిరుపతి, ఎస్సీ,ఎస్టీ కమిటీ సభ్యులు పాల్గొన్నారు.