calender_icon.png 16 April, 2025 | 12:47 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

సారంగపల్లిలో అంబేద్కర్ జయంతి వేడుకలు

14-04-2025 05:23:22 PM

మందమర్రి (విజయక్రాంతి): ప్రపంచ మేధావి, భారత రాజ్యాంగ రూప శిల్పి, న్యాయ కోవిదుడు, ఆర్థిక వేత్త, మానవ-మహిళ హక్కులకు పునాది వేసిన డా, బాబా సాహెబ్ భీమ్ రావ్ అంబేద్కర్ 134వ జయంతి వేడుకలు మండలంలోని సారంగపల్లి గ్రామంలో సోమవారం ఘనం గా నిర్వహించారు. సందర్భంగా అంబేద్కర్ యూత్ కమిటీ సభ్యులు బచ్చలి ప్రవీణ్ కుమార్ మాట్లాడారు. ప్రపంచం గర్వించదగ్గ గొప్ప మేధావి బాబాసాహెబ్ అంబేద్కర్ అని ఆయన ఆశయాలను కొనసాగించేందుకు ప్రతి ఒక్కరు కృషి చేయాలి అన్నారు. ఈ కార్యక్రమంలో మాజీ సర్పంచ్ పెద్దపల్లి చంద్రకళ, కాంగ్రెస్ నాయకులు అసంపల్లి రాజయ్య, యాదగిరి మల్లేష్, బచ్చలి రాములు, తాజుద్దీన్, రామగిరి కుమార స్వామి, అఖిల్, ప్రమోద్ లు పాల్గొన్నారు.