14-04-2025 11:09:44 PM
తాడ్వాయి (విజయక్రాంతి): తాడ్వాయి మండలంలో సోమవారం అంబేద్కర్ జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు. తాడ్వాయి మండల కేంద్రంలో వివిధ పార్టీలకు చెందిన నాయకులు అంబేద్కర్ సంఘం ప్రతినిధులు అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. మండలంలోని ఎర్రపహాడ్, కృష్ణాజివాడి, నందివాడ, ఏండ్రియాల్,దేమి కలన్ కన్ కల్, కరడ్పల్లి, చిట్యాల, బ్రాహ్మణపల్లి గ్రామాల్లో వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ప్రతినిధులు మాట్లాడుతూ... అంబేద్కర్ జయంతి జరుపుకోవడం ఎంతో ఆనందంగా ఉందని తెలిపారు.
అంబేద్కర్ ప్రపంచంలోనే మేధావి అని తెలిపారు ఆయన రచించిన భారత రాజ్యాంగం ప్రపంచంలోనే ఖ్యాతిగాంచినదని తెలిపారు అంబేద్కర్ జయంతి సందర్భంగా తాడ్వాయి మండల కేంద్రంలోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో తలసేమియా వ్యాధి తో బాధపడుతున్న చిన్నారుల కోసం రక్తదాన కార్యక్రమం నిర్వహించారు ఈ సందర్భంగా యువకులు రక్తాన్ని దానం చేశారు ఈ కార్యక్రమంలో నాయకులు కపిల్ రెడ్డి,శ్యామ్ రావు, నర్సింలు,నారాయణ, స్వామి, గైని శివాజీ, చిట్యాల సాయన్న ప్రతినిధులు తదితరులు పాల్గొన్నారు.