calender_icon.png 16 April, 2025 | 12:41 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ఘనంగా అంబేడ్కర్‌ జయంతి వేడుకలు

14-04-2025 05:47:39 PM

రామకృష్ణాపూర్ (విజయక్రాంతి): రామకృష్ణాపూర్ పట్టణంలో రాజ్యాంగ నిర్మాత డాక్టర్‌ బీఆర్‌ అంబేడ్కర్‌ 134వ జయంతిని ఘనంగా నిర్వహించారు. సోమవారం పట్టణంలోని అంగడి బజార్ ఏరియాలో ఉన్న అంబేడ్కర్‌ విగ్రహానికి,చిత్రపటానికి స్థానిక ఎమ్మెల్యే గడ్డం వివేక్ వెంకటస్వామి పూలమాలలు వేసి నివాళి అర్పించారు.కేక్ కట్ చేశారు. అనంతరం ఆయన మాట్లాడుతూ... అణగారిన వర్గాల సంక్షేమం కోసం అంబేడ్కర్‌ చేసిన కృషిని మరువలేనిదని పేర్కొన్నారు.అంబేడ్కర్‌ ఆశయాలను సాకారం చేయడానికి అందరూ కృషి చేయాలని పిలుపునిచ్చారు. తెలంగాణ ఏర్పాటు కలను సాధ్యం చేసింది అంబేడ్కర్‌ రాజ్యాంగమేనన్నారు.