14-04-2025 05:16:23 PM
బెల్లంపల్లి (విజయక్రాంతి): మంచిర్యాల జిల్లా బెల్లంపల్లి పట్టణంలో బిఆర్ అంబేద్కర్ జయంతి వేడుకలు అట్టహాసంగా జరిగాయి. కాంగ్రెస్ పట్టణ ఆఫీసులో జరిగిన అంబేద్కర్ జయంతిలో వేడుకల్లో ఎమ్మెల్యే పాల్గొన్నారు. అంబేద్కర్ చిత్రపటానికి పూలమాల వేసి ఎమ్మెల్యే గడ్డం వినోద్ నివాళి అర్పించారు. ఈ కార్యక్రమంలో టీపీసీసీ రాష్ట్ర ప్రచార కమిటీ కన్వీనర్ నాతరి స్వామి, ఉమ్మడి జిల్లా కాంగ్రెస్ పార్టీ కార్యదర్శి గేల్లి జయరాం, పట్టణ అధ్యక్షులు ముచ్చర్ల మల్లయ్య, కాంగ్రెస్ నాయకులు అనంతరం ఏఐసీసీ రాష్ట్ర పార్టీ ఆదేశాల మేరకు జై బాపు, జై భీమ్, జై సంవిధాన్, కార్యక్రమంలో భాగంగా కాంగ్రెస్ పార్టీ కార్యాలయం నుంచి పాత బస్టాండ్ మీదుగా అంబేద్కర్ చౌక్ వరకి ర్యాలీ తీయడం జరిగింది ఈ కార్యక్రమలో కాంగ్రెస్ పార్టీ నాయకు కార్యకర్తలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు.