28-04-2025 12:10:11 AM
మద్నూర్, ఏప్రిల్ 27: కామారెడ్డి జిల్లా మద్నూర్ మండలం ధనుర్ గ్రామంలో ఆదివారం అంబేద్కర్ యువత , గ్రామస్తుల ఆధ్వర్యంలో 134వ అంబేద్కర్ జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన కార్యక్రమంలో డా.బి.ఆర్.అంబేద్కర్ యొక్క జీవితం, ఆశయాల గురించి ప్రసంగించారు.
అంబేద్కర్‌ను స్ఫూర్తి గా అందరు తీసుకోవాలను సూచించారు. సమానత్వం కోసం ప్రతి ఒక్కరూ కృషి చేయాలని పిలుపునిచ్చారు. కార్యక్రమంలో ఎస్.నర్సింగ్, దేవిదాస్ పటేల్, దిగంబర్, డాక్టర్ దేవిదాస్, మధుకర్ పటేల్, ప్రకాష్ పటేల్, చందు, మాధవ్, అనిల్, దేవిదాస్, ఆకాష్, నిఖిల్, కపిల్, ఆకోష్ సంగ్రామ్ పాల్గొన్నారు.