14-04-2025 03:06:40 PM
బెల్లంపల్లి,(విజయక్రాంతి): బాబా సాహెబ్ అంబేద్కర్ ఆశయాలను తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు, నాయకులు కొనసాగించాలని బెల్లంపల్లి నియోజకవర్గ టిడిపి కన్వీనర్ అమానుల్లా ఖాన్ అన్నారు. సోమవారం బెల్లంపల్లి అంబేద్కర్ చౌరస్తా వద్ద మహనీయులు అంబేద్కర్ 134 జయంతి వేడుకల్లో పాల్గొని ఆయన విగ్రహానికి పూలమాల వేసి నివాళి అర్పించారు. భారతదేశ ప్రజలందరికీ సమాన హక్కులు, స్వేచ్ఛను కల్పించిన అంబేద్కర్ ఆలోచన విధానాన్ని ప్రతి ఒక్కరు గౌరవించాలని కోరారు. ఈ కార్యక్రమంలో టిడిపి కార్యకర్తలు రాజు, అశోక్, రాకేష్, అంజాద్ ఖాన్, మాజీ కౌన్సిలర్ మహబూబీ తదితరులు పాల్గొన్నారు.