calender_icon.png 15 April, 2025 | 10:05 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

అంబేద్కర్ కు నివాళులు

14-04-2025 12:58:06 PM

కుమ్రంభీం ఆసిఫాబాద్(విజయక్రాంతి): జిల్లా కేంద్రంలోని అటవీశాఖ జిల్లా కార్యాలయం లో  సోమవారం జిల్లా అటవీ అధికారి నీరజ్ కుమార్ టిబ్రేవెల్ ఆధ్వర్యంలో డాక్టర్ బాబా సాహెబ్ అంబేద్కర్ 134 వ జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు. డిఎఫ్ఓ మాట్లాడుతూ... అంబేద్కర్ ఆశయాలకు అనుగుణంగా అటవీ అధికారులందరూ పర్యావరణ పరిరక్షణకు పాటుపడుతూ కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల ఆదేశాలకు అనుగుణంగా పని చేస్తూ  ప్రజలకు అటవీ రక్షణ వన్యప్రాణి సంరక్షణ  అహహణ  కల్పిస్తూ ముందుకు సాగాలని సూచించారు. ఈ కార్యక్రమం లో ఆసిఫాబాద్ అటవి క్షేత్రదికారి గోవింద్ చంద్ సర్దార్, ఢీఆర్వో యోగేష్ కులకర్ణి, సిబ్బంది పాల్గొన్నారు.