calender_icon.png 15 April, 2025 | 10:29 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

బార్ అసోసియేషన్ ఆధ్వర్యంలో అంబేద్కర్ జయంతి వేడుకలు

14-04-2025 11:23:18 AM

బెల్లంపల్లి,(విజయక్రాంతి): బెల్లంపల్లి పట్టణంలోని జూనియర్ సివిల్ న్యాయస్థానం ఆవరణలో సోమవారం భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ జయంతి వేడుకలను బార్ అసోసియేషన్ అధ్యక్షులు అంకం శివకుమార్ ఆధ్వర్యంలో న్యాయవాదులు ఘనంగా జరుపుకున్నారు. ముందుగా అంబేద్కర్ చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనమైన నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా బెల్లంపల్లి బార్ అసోసియేషన్ అధ్యక్షులు అంకం శివకుమార్ మాట్లాడుతూ అంబేద్కర్ రాజ్యాంగం ద్వారా కల్పించిన న్యాయపరమైన హక్కులను బడుగు బలహీనవర్గాల ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని కోరారు. న్యాయ వ్యవస్థ పై అన్ని వర్గాల ప్రజలు నమ్మకాన్ని ఉంచి మంచి మార్గం వైపు పయనించాలని సూచించారు. బడుగు బలహీన వర్గాల ప్రజల తో పాటు సామాన్యులకు కూడా సామన్యాయం అందించడంలో న్యాయ వ్యవస్థ తనదైన పాత్ర పోషిస్తుందన్న విషయాన్ని ప్రతి ఒక్కరు గమనించాలని సూచించారు. ఈ కార్యక్రమంలో న్యాయవాదులు సునీల్ థామస్, శ్రీనివాస్, నల్లుల సంగీత, జాడి రాజేష్ తోపాటు కోర్టు సిబ్బంది పాల్గొన్నారు.