14-04-2025 06:49:31 PM
పెన్ పహాడ్: సూర్యాపేట జిల్లా పెన్ పహాడ్ మండల కేంద్రంలో సోమవారం (డి బీ ఎస్ యూ ), అనాజిపురం గ్రామంలో ఎంఆర్పిఎస్ ఆధ్వర్యంలో నిర్వహించిన డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ జయంతి వేడుకలు కార్యక్రమానికి ఏఎస్పి నాగేశ్వరరావు విచ్చేసి అంబేద్కర్ విగ్రహానికి పూలమాలవేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. సామాజిక అసమానతలకు అలుపెరగని పోరాటం చేసిన మహనీయుడు డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ అన్నారు. బడుగు బలహీన వర్గాల అభ్యున్నతి కోసం ఎన్నో సంస్కరణలు కోసం రాజ్యాంగంలో అనేక ఆర్టికల్ రూపొందించాలని , రాజ్యాంగంలో రూపొందించిన ఆర్టికల్స్ ప్రకారమే నేడు మనమందరం ఫలాలు పొందుతున్నామని అన్నారు. ఈ కార్యక్రమంలో ఎస్సై గోపికృష్ణ, డైరెక్టర్ దామోదర్ రెడ్డి, చెన్ను రమణారెడ్డి, లక్కపాక నరసయ్య, మురళి, కత్తి రవీందర్, దాసరి శ్రీనివాస్, తదితరులు ఉన్నారు.