calender_icon.png 16 April, 2025 | 1:21 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ఘనంగా డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ జయంతి వేడుకలు

14-04-2025 05:38:48 PM

దౌల్తాబాద్/చేగుంట (విజయక్రాంతి): ప్రపంచ మేధావి, భారత రాజ్యాంగ నిర్మాత, బడుగు బలహీన వర్గాల ఆశాజ్యోతి డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ 134వ జయంతి ఉత్సవాల సందర్భంగా సోమవారం నాడు మండల వ్యాప్తంగా  ఘనంగా నిర్వహించారు. దళిత సంఘాల నాయకులు,  అంబేద్కర్ యువజన సంఘాలు, వివిధ పార్టీ ల అధ్యక్షులు, వివిధ ఉపాధ్యాయ సంఘ నాయకులు, అంబేద్కర్ విగ్రహానికి పూలమాల వేసి నివాళులు అర్పించారు. మండల పరిదిలోని చేట్ల,నర్సంపల్లి గ్రామంలో దొడ్డి మహేందర్ ఆధ్వర్యంలో డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ జయంతి వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా గ్రామంలో గల అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు.

అనంతరం అంబేద్కర్ సంఘ నాయకులు మాట్లాడుతూ స్వేచ్ఛ సమానత్వం కోసం, బలహీన వర్గాల అభ్యున్నతికి అలుపెరుగని పోరాటం చేసిన గొప్ప వ్యక్తి మహనీయుడు అంబేద్కర్ కొనియాడారు. భారత రాజ్యాంగంలో కల్పించిన హక్కులు బలహీనవర్గాల ప్రజలకు అందినప్పుడే ఆయనకిచ్చే నిజమైన నివాళులని అన్నారు. రాజ్యాంగంలో కల్పించిన హక్కుల కోసం ప్రతి ఒక్కరు అంబేద్కర్ ఆశయాల కోసం నిరంతరం కృషి చేయాలని వారు పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో తాజా మాజీ సర్పంచ్,గ్రామ పెద్దలు వెమా శ్రీనివాస్, పసి నర్సిములు, వేమా కనకరాజు, వేమా సత్యయ,, దుబాసి స్వామి,దళిత సంఘాల నాయకులు, అంబేద్కర్ సంఘం నాయకులు, మద్దేల నాగార్జున, దొడ్డి మహేందర్, మద్దెల లింగం, దొడ్డి ప్రభాకర్, శంకర్, ఆంజనేయులు, ఎల్లం,గ్రామస్తులు తదితరులు పాల్గొన్నారు.