14-04-2025 07:24:44 PM
మహాదేవపూర్ (విజయక్రాంతి): మహాదేవపూర్ మండల వ్యాప్తంగా అంబేద్కర్ జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు. మండల కేంద్రంలోని జాతీయ రహదారిపై గల అంబేద్కర్ విగ్రహానికి అంబేద్కర్ జయంతి సందర్భంగా వివిధ పార్టీల ప్రజా సంఘాల ఆధ్వర్యంలో పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. ఈ కార్యక్రమంలో వక్తలు మాట్లాడుతూ.. అంబేద్కర్ అందరి వాడని అంబేద్కర్ రచించిన రాజ్యాంగం వల్ల హక్కులను ప్రజలందరూ పొందడం జరిగిందని పలువురు మాట్లాడడం జరిగింది.
ఈ కార్యక్రమంలో ఎమ్మార్పీఎస్ మండల అధ్యక్షుడు బెల్లంపల్లి సురేష్, బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షుడు కోట రాజబాబు, మాజీ ఎంపీపీ రాణి బాయి , మాజీ జెడ్పిటిసి అరుణ, కాంగ్రెస్ సీనియర్ నాయకులు వామన్ రావు, బిజెపి మండల అధ్యక్షుడు రామ్ శెట్టి మనోజ్, ఆకుల శ్రీధర్, ఐలయ్య, బిఆర్ఎస్ నాయకులు మాజీ సర్పంచ్ శ్రీపతి బాపు, ఎండి అలిన్, అన్కారి ప్రకాష్, ప్రభాకర్, పి ఆర్ టి యు తెలంగాణ జిల్లా ప్రధాన కార్యదర్శి పసుల శంకర్, శరత్, దళిత సీనియర్ నాయకులు, మెరుగు లక్ష్మణ్, పెద్ద సమ్మయ్య, లింగాల రామయ్య, నల్ల బుగ్గ ధర్మయ్య, మోతే సాంబయ్య, చేకుర్తి శంకరయ్య, నల్ల బుగ్గ సమ్మయ్య, మంతిని రవితేజ, బెల్లంపల్లి జాషువా, చింతకుంట్ల రాము, కులమతాలకు,పార్టీలకు అతీతంగా నాయకులు మేధావులు విద్యావంతులు యువకులు విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు.