14-04-2025 11:01:54 PM
కొల్చారం (విజయక్రాంతి): రాజ్యాంగ రూపకర్త డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ 135వ జయంతిని పురస్కరించుకొని కొల్చారం మండల వ్యాప్తంగా అంబేద్కర్ విగ్రహాలకు, చిత్రపటాలకు పూల మాలలు వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా ఎస్సీ సెల్ జిల్లా కార్యదర్శి మారెల్లి అనిల్, మాజీ జెడ్పిటిసి ముత్యంగారి మేఘమాల సంతోష్ కుమార్, మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు నాగులగారి మల్లేష్ గౌడ్ మాట్లాడుతూ... అంబేద్కర్ కొలంబియా విశ్వవిద్యాలయం నుండి పి.హెచ్.డి. లండన్ విశ్వవిద్యాలయం నుండి డి.ఎస్.సి (డాక్టరేట్) పట్టాలను పొంది చాలా అరుదైన గౌరవాన్ని సంపాదించాడు. న్యాయ, సామాజిక, ఆర్థిక శాస్త్రాలలో పరిశోధనలు చేశాడు. మొదట్లో న్యాయవాదిగా, అధ్యాపకుడిగా, ఆర్థికవేత్తగా పనిచేశాడు.
అణగారిన వర్గాల సామాజిక, ఆర్థిక సాధికారత కోసం జీవితాంతం పరితపించిన మహానీయుడు అంబేద్కర్ అని కొనియాడారు. బడుగు, బలహీన వర్గాల హక్కులకు ఎలాంటి అవరోధాలు కలగకూడదనే ఉద్దేశంతో, వారికి కచ్చితమైన భరోసాని, భవిష్యత్తుని ఇచ్చేలా రాజ్యాంగాన్ని రూపొందించిన మహానీయుడు డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ అని అన్నారు. కార్యక్రమంలో జూలకంటి సంగమేశ్వర్ (కండక్టర్), విశ్రాంత ఉద్యోగులు సంజీవరావు, కరెంట్ రాజా గౌడ్, (గజిని )వెంకట్ గౌడ్, ముత్యం ప్రవీణ్, ఎర్రోళ్ల శ్రీనివాస్, రాజీగారి కృష్ణ, నిమ్మగల్ల ఆంజనేయులు, దోమకొండ సత్యం, నింగోల చెన్నయ్య, రాజిరెడ్డి, చౌరిగారి చిన్న రాములు, రాజేందర్ గౌడ్, గడ్డమీది నర్సింలు, సాయిని సిద్ధిరాములు, యాదగిరి, పాండ్ర వెంకటేశం తదితరులు పాల్గొన్నారు.