calender_icon.png 16 April, 2025 | 12:47 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

పొన్నారంలో ఘనంగా అంబేద్కర్ జయంతి వేడుకలు

14-04-2025 05:22:16 PM

మందమర్రి (విజయక్రాంతి): మండలంలోని పొన్నారం గ్రామపంచాయతీలో భారత రత్న, భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బిఆర్ అంబేద్కర్ జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు. గ్రామంలోని గ్రామ పంచాయతీ కార్యాలయంలో సోమవారం అంబేద్కర్ చిత్ర పటానికి పూల మాలలు వేసి నివాళులు అర్పించారు. అంబేద్కర్ ఆశయాలను ముందుకు తీసుకుపోవాలని కోరారు.ఈ కార్యక్రమం లో మాసు సంతోష్ కుమార్, ఈద లింగయ్య, పెంచాల రాజలింగు, గడ్డం శ్రీనివాస్, బొజ్జ రాములు, నీలం ఆనంద్, వేల్పుల సుధాకర్, కుంటాల పోచయ్య నీలం మల్లేష్, నాగరాజ్, వినయ్ లు పాల్గొన్నారు.