14-04-2025 10:46:11 PM
భద్రాద్రి కొత్తగూడెం (విజయక్రాంతి): భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పారిశ్రామిక ప్రాంతమైన పాల్వంచలో అఖిలభారత ఎస్సీ, ఎస్టీ హక్కుల పరిరక్షణ సంఘం ఆధ్వర్యంలో సోమవారం భారత రాజ్యాంగ నిర్మాత బాబాసాహెబ్ అంబేద్కర్ జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా కొత్తగూడెం నియోజకవర్గ ఎమ్మెల్యే సాంబశివరావు పాల్గొన్నారు. అణగారిన వర్గాల అభ్యున్నతికి అంబేద్కర్ చేసిన సేవలను కొనియాడారు. ఈ కార్యక్రమంలో పార్టీలకతీతంగా బిజెపి, కాంగ్రెస్, బిఆర్ఎస్ ,సిపిఎం, సిపిఐ, రాజకీయ పార్టీలతోపాటు ఉపాధ్యాయ కార్మిక కుల సంఘాల నేతలు పాల్గొని అంబేద్కర్ విగ్రహానికి పూలమాలవేసి నివాళులర్పించారు.
ఈ కార్యక్రమంలో మున్సిపల్ కమిషనర్ సుజాత, సీఐ సతీష్ కుమార్, ఎస్ఐ సుమన్, ఆ సంఘం పట్టణ అధ్యక్షులు కాల్వ ప్రకాష్ రావు, రాష్ట్ర నాయకులు కాల్వ దేవదాస్, గౌరవ అధ్యక్షులు కాల్వ భాస్కరరావు, భారతీయ జనతా పార్టీ రాష్ట్ర నాయకులు, జిల్లా అధ్యక్షులు బైరెడ్డి ప్రభాకర్ రెడ్డి, కాంగ్రెస్ పార్టీ నాయకులు కొత్వాల శ్రీనివాసరావు, ఎడవెల్లి కృష్ణ, బిఆర్ఎస్ నాయకులు కిలార నాగేశ్వరావు, పట్టణ అధ్యక్షులు మంతపురి రాజగౌడ్, సిపిఎం నాయకులు దొడ్డ రవి, సత్య, సిపిఐ నాయకులు ఎస్కే షాబీర్ పాషా, బండి నాగేశ్వరరావు, దళిత సంఘం నాయకులు ముళ్ళపాటి రాజేంద్ర కుమార్, కొత్తపల్లి సోమయ్య, దాసరి నాగేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు.