calender_icon.png 16 April, 2025 | 3:07 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

అశ్వాపురంలో ఘనంగా డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ జయంతి వేడుకలు

14-04-2025 06:54:56 PM

అశ్వాపురం (విజయక్రాంతి): రాజ్యాంగ నిర్మాత, భారతరత్న బాబాసాహెబ్ డాక్టర్ బీఆర్ అంబేద్కర్ 134వ జయంతి వేడుకలు సోమవారం అశ్వాపురం మండల వ్యాప్తంగా ఘనంగా నిర్వహించారు.  కాంగ్రెస్ పార్టీ మండల కార్యాలయంలో పార్టీ మండల అధ్యక్షుడు ఓరుగంటి భిక్షమయ్య, ఎస్సీ సెల్ మండల అధ్యక్షుడు మచ్చా నరసింహారావు ఆధ్వర్యంలో అంబేడ్కర్ జయంతి కార్యక్రమం నిర్వహించి అంబేడ్కర్ చిత్ర పటానికి పూల మాలలు వేసి ఘనంగా నివాళులు అర్పించారు.

ఈ సందర్భంగా  ఆయన మాట్లాడుతూ... సమాజంలో అంటరానితనం, బానిసత్వం, అస్పృశ్యతల నిర్మూలనకు, వివక్ష పై అలుపెరుగని పోరాటం చేసి, అన్ని వర్గాల ప్రజలకు సమాన హక్కులు కల్పించిన ఘనత అంబేద్కర్‌కే దక్కుతుందని అన్నారు. అందరూ సమానంగా, ప్రతి ఒక్కరికీ ఓటు హక్కు, రిజర్వేషన్లు, అన్ని వెనుకబడిన వర్గాలకు సమానత్వం రావడానికి ముఖ్య కారణం అంబేద్కర్ పోరాటమే అని తెలిపారు. ఈ కార్యక్రమంలో బచ్చు వెంకటరమణ , తూము రాఘవులు ,బేతం రామకృష్ణ , ఆవుల రవి, భురెడ్డి వెంకటరెడ్డి, మనాది సైదులు ,రాఘం మల్లయ్య, సమకూరి వెంకన్న , భారసు సంపత్ ,చెన్నయ్య ,దాసరి జయ కృష్ణ ,గొల్లపల్లి నరేష్, సింగం శ్రీధర్ ,గొడ్ల నాగేశ్వరావు, బేతం భాబు,బద్రారెడ్డి రెడ్డి  తదితరులు పాల్గొన్నారు.