14-04-2025 11:20:31 AM
బెల్లంపల్లి అర్బన్,(విజయక్రాంతి): మంచిర్యాల జిల్లా బెల్లంపల్లిలో డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ 134 వ జయంతి వేడుకలు అంబరాన్నంటాయి. శాంతి గనిలో ఎస్సీ ఎస్టీ అసోసియేషన్ ఆధ్వర్యంలో నిర్వహించిన అంబేద్కర్ జయంతి వేడుకల్లో బెల్లంపల్లి ఎమ్మెల్యే గడ్డం వినో ద్ పాలవని మాట్లాడారు. అంతకుముందు అంబేద్కర్ చిత్రపటానికి నివాళులర్పించి జెండా ఆవిష్కరణ చేశారు. ఈ సందర్భంగా కేక్ కట్ చేసి జయంతి వేడుకలను ఎమ్మెల్యే నిర్వహించారు. బిఆర్ అంబేద్కర్ చిత్రపటానికి పూలమాలవేసి ఎమ్మెల్యే గడ్డం వినోద్ నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడారు. భారత స్వతంత్ర సమరయోధుడు, రాజ్యాంగ నిర్మాత, దళిత బడుగు బలహీన వర్గాల, వికాసానికి పాడుపడిన మహానేత భారతరత్న డాక్టర్.బీఆర్ అంబేద్కర్ అని కొనియాడారు. డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ భారత రాజ్యాంగాన్ని రాసి పేద ప్రజల బతుకుల్లో వెలుగులు నింపారని అన్నారు. రాజ్యాంగ స్ఫూర్తిని అంబేడ్కర్ ఆశయాలను దెబ్బతీసేలా కేంద్రంలోని బిజెపి ప్రభుత్వం వ్యవహరిస్తున్నదని, వారి కుట్రను తిప్పికొట్టేందుకే జై బాపు జై భీమ్ జై సంవిధాన్ రాజ్యాంగ పరిరక్షణ యాత్ర కాంగ్రెస్ పార్టీ దేశవ్యాప్తంగా నిర్వహిస్తున్నదని అన్నారు. అణగారిన వర్గాలకి డా బి ఆర్ అంబేద్కర్ ఆశాకిరణమని బడుగు బలహీనుల జీవితాల్లో వెలుగు నింపిన మహనీయుడి సేవలు చిరస్మరణీయమన్నారు. ఈ కార్యక్రమంలో గని మేనేజర్ విజయ్ కుమార్, ఎస్సీ ఎస్టీ అసోసియేషన్ నాయకులు బడికల రమేష్, కిరణ్, కాంగ్రెస్ నాయకులు సిహెచ్ శంకర్, మునిమంద రమేష్, అధికారులు, కార్మికులు పాల్గొన్నారు.