calender_icon.png 13 April, 2025 | 8:01 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ఘనంగా అంబేద్కర్ అందరివాడు బహుజన కవిసమ్మేళనం

12-04-2025 10:12:02 PM

జనగామ (విజయక్రాంతి): తెలంగాణ అంబేద్కర్ యువజన సంఘం, సాధిక్ ఫౌండేషన్ నిర్వహణలో అంబేద్కర్ అందరివాడు బహుజన కవిసమ్మేళనం శనివారం జనగామ స్కాలర్ గ్రామర్ స్కూల్ లో ఘనంగా నిర్వహించారు. సభ సమావేశానికి తెలంగాణ అంబేద్కర్ యువజన సంఘం జనగామ శాఖ అధ్యక్షులు కన్నారపు శివశంకర్ అధ్యక్షత వహించగా, ముఖ్య అతిధిలుగా సాధిక్ ఫౌండేషన్ చైర్మన్ అడ్వకేట్ సాధిక్ అలీ, ప్రముఖ గైనకాలంజిస్ట్ డాక్టర్ ప్రీతి దయాల్ పాల్గొన్నారు. కార్యక్రమంలో మొదటగా మహాత్మ జ్యోతిబా పూలే జయంతి సందర్బంగా కవులు వారి చిత్ర పటానికి పూలమాల వేసి నివాళులు అర్పించారు.

జనగామ రచయితల సంఘం, కవులు కళాకారుల ఐక్యవేదిక, కవి హృదయం సాహిత్య వేదిక, శ్రీశ్రీ కళావేదిక సమన్వయంతో నాలుగు ఆవృతలుగా జరిగిన కవి సమ్మేళనానికి జి. కృష్ణ, పెట్లోజు సోమేశ్వరా చారి, సాంబరాజు యాదగిరి, అయిలా సోమనర్సింహా చారి, అధ్యక్షత వహించి నిర్వహించారు. ముఖ్య అతిధి సాధిక్ అలీ మాట్లాడుతూ... అంబేద్కర్ అందరివాడు అని, వారి ఆశయాల సాధనకు ప్రతి ఒక్కరు కృషి చేయాలన్నారు. కవిత గానం చేసిన కవులకు ఆత్మీయ సత్కారం, అంబేద్కర్ జీవిత విశేషాల పుస్తకం అందజేశారు.

ఈ కార్యక్రమంలో లగిశెట్టి ప్రభాకర్, కొలిపాక బాలయ్య, పానుగంటి రామమూర్తి, మసురం రాజేంద్ర ప్రసాద్, పొట్టబత్తిని భాస్కర్, గడ్డం మనోజ్ కుమార్, తాళ్లపల్లి లక్ష్మణ్ గౌడ్, చిలుమోజు సాయికిరణ్, రేణుకుంట్ల మురళి, అంకాల సోమయ్య, ఎలే సరిత, దీగోజు శ్రీలక్ష్మి, రేగోటి ఉషారాణి, రంగరాజు ప్రసాద్, గుండె కనకయ్య, నిమ్మ రాంరెడ్డి, గూటం రమేష్, నిమ్మ జయపాల్ రెడ్డి, మామిళ్ల అంజయ్య, తోలుపునూరి రామచంద్రం, మహమ్మద్ అఫ్జల్, మారోజు రాజేశ్వర్, జోగు సుదర్శన్, కన్నారపు పరుశురాములు, రాగల్ల శ్రీహరి కవిత తదితరులు పాల్గొన్నారు.