14-04-2025 08:31:11 PM
సిపిఐ, ప్రజా సంఘాల ఆధ్వర్యంలో అంబేద్కర్ జయంతి...
పాల్వంచ (విజయక్రాంతి): అవమానాలు పొందిన చోటే సత్కారాలు పొంది ప్రపంచానికి స్పూర్తిదాతగా, మహోన్నత నేతగా ఎగిన డాక్టర్ బీఆర్. అంబేడ్కర్ ప్రపంచానికి స్ఫూర్తి ప్రదాత అని సిపిఐ జిల్లా సమితి సభ్యులు బండి నాగేశ్వరరావు, పట్టణ సహాయ కార్యదర్శి ఉప్పుశెట్టి రాహుల్ అన్నారు. నవభారత రాజ్యాంగ నిర్మాత, భారత రత్న డాక్టర్ బిఆర్. అంబేద్కర్ 134వ జయంతి వేడుకలను సిపిఐ ఆధ్వర్యంలో సోమవారం స్థానిక చండ్ర రాజేశ్వరరావు భవన్ లో ఘనంగా నిర్వహించారు. వారు మాట్లాడుతూ... చిన్నతనంలో ఎదురైన కష్ట నష్టాలను ఎదుర్కొవడంతోపాటు అవమానాలను చిరునవ్వుతో దిగమించిన ధీశాలి అంబేద్కర్ అని కొనియాడారు. దేశంలో నిమ్న జాతులన్నింటికీ దిశానిర్ధేశం చేసి భారత రత్నగా ఎదిగారన్నారు. రాజ్యాంగం ద్వారానే సాంఘిక అసమానతల్ని రూపుమాపాలని అంబేద్కర్ తెలిపాదని, సోషలిజం కోసం ఆయన కలలు కన్నారన్నారు. అంబేద్కర్ భావజాలాన్ని విస్త్రతంగా సమాజంలోకి తీసుకెళ్లేందుకు కృషి చేయాలన్నారు.
సామాజిక న్యాయమును చిన్నాభిన్నం చేసి కుల వ్యవస్థను పెంచి పోషించే ప్రయత్నాలు జరుగుతున్నాయని, రాజ్యాంగం స్థానంలో మనుస్మృతిని తీసుకువచ్చేదానికి పూనుకుంటున్నారని దానికి వ్యతిరేకంగా కమ్యూనిస్టులు, అంబేద్కరిస్టులు, ప్రజాస్వామ్యవాదులు పోరాడాలని అన్నారు.ఈ కార్యక్రమంలో సిపిఐ జిల్లా సమితి సభ్యులు డీ సుధాకర్, ప్రజాసంఘాల నాయకులు అన్నారపు వెంకటేశ్వర్లు, ఇట్టి వెంకట్రావు, నిమ్మల రాంబాబు, చెరుకూరి శేఖర్, చెన్నయ్య, మడుపు ఉపేంద్ర చారి, వైఎస్ గిరి, వల్లపు యాకయ్య, బీవీ సత్యనారాయణ, బానోత్ రంజిత్, రవి, బానోత్ చందులాల్, జరుపుల మోహన్, జకీరయ్య, బాదావత్ శ్రీను, బిక్కు లాల్, ఎస్కే కరీం, ఆవుల సతీష్, ఎర్రగడ్డ ప్రభాకర్, ఆదినారాయణ, బిల్లా రంగయ్య, రాము, సత్యనారాయణ తదితరులు పాల్గొన్నారు.