14-04-2025 07:39:05 PM
కొత్తగూడెం (విజయక్రాంతి): భారతదేశ రాజ్యాంగ నిర్మాత, సామాజిక, రాజకీయ, ఆర్థిక విధానాల నిర్ణేత, ప్రజాస్వామ్య పరిరక్షకుడు, ప్రపంచ మేధావి, అణగారిన వర్గాల ఆరాధ్య దైవం, భారతరత్న డాక్టర్ బిఆర్ అంబేద్కర్ 134వ జయంతి సందర్భంగా, కొత్తగూడెం పోస్ట్ ఆఫీస్ సెంటర్ లో అంబేద్కర్ విగ్రహానికి, యువజన కాంగ్రెస్ భద్రాద్రి కొత్తగూడెం అధ్యక్షులు చీకటి కార్తీక్ పూలమాలలు వేసి ఘనంగా నివాళి అర్పించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ... అట్టడుగు స్థాయి నుండి గొప్ప నేతగా ఎదిగిన మహనీయుడు, డాక్టర్ బాబా సాహెబ్ అంబేద్కర్ అందరికీ ఆదర్శం అని అన్నారు.
బడుగు బలహీన వర్గాల ప్రజల హక్కుల కోసం పోరాడి ప్రపంచానికి ఆదర్శంగా నిలిచారని కొనియాడారు. రాజ్యాంగ నిర్మాతగా దేశ భవిష్యత్తును ముందుగానే ఊహించి, భావి తరాలకు స్పూర్తిగా నిలిచిన గొప్ప దార్శనికుడు అంబేద్కర్, అడుగు జాడల్లో నడిచేందుకు అందరూ కృషి చేయాలన్నారు. ఈ కార్యక్రమంలో యూత్ కాంగ్రెస్ శ్రేణులు గులాం మతిన్, కసనబోయిన రాము, తాటి పవన్, కుంచం వెంకటేష్, అంతడుపుల శివకుమార్, మహేష్, వాంకుడోత్ శ్రీకాంత్, జై సూర్య, ప్రణయ్, సాయి, జీడి సందీప్, మరియు తదితరులు పాల్గొన్నారు.