16-04-2025 12:00:00 AM
మంథా కృష్ణచైతన్య హీరోగా నటిస్తూ స్వీయ దర్శకత్వంలో సొంతంగా నిర్మించిన చిత్రం ‘అగ్రహారంలో అంబేద్కర్’. ఈ చిత్రాన్ని రామోజీ లక్షమోజి ఫిల్మ్స్ పతాకంపై రూపుది ద్దుకున్న ఈ సినిమా ఫస్ట్‌లుక్ విడుదలైంది. అంబేద్కర్ జయంతి సందర్భంగా నిర్వహించిన ఈ సినిమా ఫస్ట్‌లుక్ లాంచ్ ఈవెంట్‌కు ఎమ్మెల్సీ అద్దంకి దయాకర్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడు తూ.. ‘అంబేద్కర్ భావజాలాన్ని విశ్వవ్యాప్తం చేయడమే లక్ష్యంగా తెరకెక్కిన ఈ సినిమా విడుదలకు పూర్తి సహకారం అందిస్తాం’ అన్నారు.
కృష్ణచైతన్య మాట్లాడుతూ.. ‘కుల, మత, ప్రాంత, వర్గ వైషమ్యాలకు అతీతంగా సమాజ స్థాపన కోసం కృషిచేసిన అంబేద్కర్‌కు గొప్ప నివాళిగా ఈ చిత్రాన్ని ఎన్నో వ్యయప్రయాసలకోర్చి తెరకెక్కించాం. ఇప్పటికే పలు ప్రతిష్టాత్మక అంతర్జాతీయ చలనచిత్రోత్సవాల్లో పురస్కారాలు దక్కించుకున్న ఈ చిత్రాన్ని ప్రపంచవ్యాప్తంగా విడుదల చేసేందుకు సన్నాహాలు చేస్తున్నాం’ అని తెలిపారు. దర్శకుడు చంద్రమహేశ్, నిర్మాత తుమ్మలపల్లి రామసత్యనారాయణ తదితరులు పాల్గొన్నారు.