calender_icon.png 5 April, 2025 | 6:27 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

నేడు అంబేద్కర్ విగ్రహాలకు వినతులు

17-12-2024 01:47:57 AM

* బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ 

హైదరాబాద్, డిసెంబర్ 16 (విజయక్రాంతి): లగచర్ల రైతులపై అక్రమ కేసులు పెట్టి, థర్డ్ డిగ్రీ ప్రయోగించి జైళ్లలో నిర్బంధించి, రైతులన్న చేతులకు బేడీలు వేసిన కాంగ్రెస్ ప్రభుత్వ అణిచివేతలకు నిరసనగా మంగళవారం రాష్ట్రవ్యాప్తంగా బీఆర్‌ఎస్ నిరసనలకు పిలుపునిచ్చింది. రైతన్నలపై నమోదు చేసిన అక్రమ కేసులను ఎత్తివేసి, వారిని వెంటనే విడదల చేయాలని బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ సోమవారం ఒక ప్రకటనలో డిమాండ్ చేశారు. అన్ని నియోజకవర్గాల్లో ఉదయం 11 గంటలకు డాక్టర్ బీఆర్ అంబేద్కర్ విగ్రహాలకు వినతిపత్రాలు సమర్పించాలని పార్టీ శ్రేణులకు కేటీఆర్ సూచించారు.