04-04-2025 08:41:24 PM
ఏవైఎస్ మండల అధ్యక్షుడు జన్నే యుగేందర్
చిట్యాల,(విజయక్రాంతి): అంబేద్కర్ ఆశయాలను, సిద్ధాంతాలను కొనసాగించాలని ఏవైఎస్ మండల అధ్యక్షుడు జన్నే యుగేందర్ అన్నారు.శుక్రవారం జయశంకర్ భూపాలపల్లి జిల్లా చిట్యాల మండల కేంద్రంలో అంబేద్కర్ యువజన సంఘం సమావేశం జరిగింది. ఈ సందర్భంగా జన్నె యుగేందర్ మాట్లాడుతూ దళితులపై జరుగుతున్న దాడులు,దౌర్జన్యాలు మహిళలపై అఘాయిత్యాలు రోజురోజుకి పెరిగిపోతున్నాయని ఆవేదన వ్యక్తంచేశారు. అఘాయిత్యాలను అడ్డుకునేందుకు గ్రామాల్లో అంబేద్కర్ యువజన సంఘాలను ఏర్పాటు చేయాలన్నారు.ఈ కార్యక్రమంలో మండల కోశాధికారి కనకం తిరుపతి,ప్రచార కార్యదర్శి కట్కూరి రాజు, అంబేద్కర్ నాయకులు ఏకు కిషన్,కండె రమేష్ పాల్గొన్నారు.