15-04-2025 12:00:00 AM
టీజీకాబ్ వైస్ చైర్మన్ సత్తయ్య
హైదరాబాద్, ఏప్రిల్ 14 (విజయక్రాంతి): తుర్కయంజయాల్‌లో సోమవారం డా. బిఆర్ అంబేద్కర్ జయంతి సందర్భంగా ఆయన విగ్రహానికి టీజీకాబ్ వైస్ చైర్మన్, డీసీసీబీ చైర్మన్ కొత్తకుర్మ సత్తయ్య పూలమాల వేసి ఘనంగా నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. -బాబాసాహెబ్ అంబేద్కర్ ఆలోచనలు, ఆశయాలే అందరికీ మార్గదర్శకంగా నిలవాలన్నారు.
ఆయన ఇచ్చిన ఓటు హక్కు రాజ్యాంగం ద్వారా లభించిన విలువైన స్వేచ్ఛ అని చెప్పారు. కార్యక్రమంలో టీపీసీసీ కార్యదర్శి కొత్తకుర్మ శివకుమార్, తుర్కయంజాల్ కాంగ్రెస్ అధ్యక్షురాలు కొత్తకుర్మ మంగమ్మ, సామ బీమ్‌రెడ్డి, సుదర్శన్‌రెడ్డి, పుల్లగుర్రం విజయనంద్‌రెడ్డి, మేతరీ దర్శన, బొక్క గౌతమ్‌రెడ్డి, చెవుల దశరథ, బీజేపీ తుర్కయంజాల్ ఎస్సీ మోర్చా అధ్యక్షుడు బచ్చిగాళ్ల రమేష్, సీపీఐ నాయకులు ఓరుగంటి యాదయ్య, సీపీఎం నాయకులు అరుణ్ కుమార్, సీఐటీయూ నాయకులు కృష్ణా, మేతరీ అశోక్, కోమని దర్శన, చెక్క సుధాకర్, చుక్క బాలరాజు, మైలారం బాబు, దుల్కాదర్, దాసరి సుధాకర్ మేతరీ శంకర్, మేతరీ బాబు, గుడ్ల శ్రీనివాస్, మేతరీ కుమార్, గుడ్ల బాలరాజ్, కర్పూరం దాస్ పాల్గొన్నారు.