calender_icon.png 13 January, 2025 | 8:11 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

అంబేద్కర్ ఆశయాలను నెరవేరుస్తున్నం

19-12-2024 01:45:14 AM

* కాంగ్రెస్ చీకటి చరిత్రను అమిత్ బయటపెట్టారు

* కాంగ్రెస్ చెప్పేవన్నీ అబద్ధాలే..

* అమిత్ షా వాస్తవాలను మాట్లాడారు: ట్విట్టర్‌లో ప్రధాని మోదీ

న్యూఢిల్లీ, డిసెంబర్ 18:  రాజ్యాంగ నిర్మాత బీఆర్ అంబేద్కర్‌ను కేంద్రహోం మంత్రి అమిత్ షా అవమానించారం టూ ప్రతిపక్షాలు ఆందోళన చేస్తున్నాయి. అమిత్ షా రాజీనామా చేయాలని డిమాండ్ చేస్తున్నాయి. అలాగే క్యాబినెట్ నుంచి కేంద్ర హోం మంత్రిని బర్తరఫ్ చేయాలని ప్రతిపక్షాలు డిమాండ్ చేస్తున్న వేళ రాజ్యసభలో జరిగిన వాస్తవాలను వెల్లడిస్తూ ప్రధాని మోదీ ఎక్స్ వేదికగా పోస్ట్ చేశారు. ఈ సందర్భంగా కాంగ్రెస్ పార్టీపై ఆయన తీవ్రస్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేశారు. అంబేద్కర్ వారసత్వాన్ని తుడిచిపెట్టేందుకు కాంగ్రెస్ యత్నిస్తుందంటూ ఆరోపించారు.

ఎస్సీ, ఎస్టీలను కించపరిచేందుకు కాంగ్రెస్ చేసి న ప్రయత్నాలన్నింటినీ దేశప్రజలంతా చూశారని తెలిపారు. గత 55 ఏళ్లలో కాంగ్రెస్ సాగించిన అరాచకాలు, అంబేద్కర్‌ను అవమానించిన తీరును ఇప్పు డు చెప్పే అబద్దాలతో వారు దాచలేరని అన్నారు. ఒకవేళ అలా అనుకుంటే వారు పెద్ద తప్పు చేసినట్టేనని ఆయన ఆరోపించారు. ఎన్నికల్లో అంబేద్కర్‌ను కాంగ్రెస్ రెండుసార్లు ఓడించిందని అన్నారు. అంబేద్కర్‌కు భారతరత్న పురస్కారాన్ని కూడా ఇవ్వలేదన్నారు. ఆయనకు వ్యతిరేకంగా నెహ్రూ అనేకసార్లు వ్యవహరించా రని ఆరోపించారు. పార్లమెంట్ సెంట్రల్ హాల్‌లో అంబేద్కర్ చిత్రపటాన్ని పెట్టడానికి కూడా కాంగ్రెస్ తిరస్కరించిందని చెప్పారు.

కాంగ్రెస్ హయాంలోనే ఎస్సీ, ఎస్టీలపై దారుణ మారణకాండలు జరిగాయని ఆరోపించారు. ప్రస్తుతం మనం ఇలా ఉండడానికి అంబేద్కరే కారణమని ఆయన పేర్కొన్నారు. 11ఏళ్లుగా అంబేద్కర్ ఆశయాలను నెరవేర్చడానికి తమ ప్రభుత్వం అవిశ్రాంతంగా కృషి చేస్తోందన్నారు. ఈ క్రమంలోనే 25 కోట్ల మందిని పేదరికం నుంచి బయటకు తీసుకువచ్చామని తెలిపారు. ఎస్సీ, ఎస్టీ చట్టాన్ని బలోపేతం చేశామన్నారు.  అంబేద్కర్‌తో సం బంధమున్న పంచతీర్థ అభివృద్ధికి కృషి చేశామని చెప్పారు. పెండింగ్‌లో ఉన్న చైత్యభూమి భూసమస్యను పరిష్కరించామని మోదీ తెలి పారు.

  లండన్‌లో అంబేద్కర్ నివసించిన ఇంటిని బీజేపీ ప్రభుత్వమే కొను గోలు చేసిందన్నారు.  అంబేద్కర్‌కు బీజే పీ ప్రభుత్వం భారతర్నత ఇచ్చి గౌరవించిందని, అలాగే సెంట్రల్ హాల్లో చిత్రప టాన్ని ఏర్పాటు చేసిందని తెలిపారు. అంబేద్కర్‌ను అవమానించిన కాంగ్రెస్ చీకటి చరిత్రను హోం మంత్రి పార్లమెంట్‌లో బయటపెట్టారని, దీంతో ఆయన మాట్లాడిన వాస్తవాలను  చూసి కాంగ్రెస్ నేతలు ఉలిక్కిపడడంతోపాటు ఆశ్చర్యపోయారని చెప్పారు. అందుకే ఇపుడు వారు నాటకాలాడుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. కానీ నిజం ఏమిటో ప్రజలకు తెలుసని ఆ పోస్ట్‌లో మోదీ పేర్కొ న్నారు. ఈ సందర్భంగా అమిత్ షా మా ట్లాడిన వీడియోను ఆయన షేర్ చేశారు.